వారం రోజుల్లో ఉచిత కరెంట్, రూ.500కే గ్యాస్ సిలిండర్ !

Telugu Lo Computer
0


తెలంగాణలో వారం రోజుల్లో తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రకటించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సొంత నియోజకవర్గం కొడంగల్లో తొలిసారి ఆయన పర్యటించారు. రూ.4,369 కోట్ల విలువైన 20 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోస్గిలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. మార్చి 15న రైతు బంధు, రైతు భరోసా అమలు చేస్తామని వెల్లడించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తీసుకుంటానని స్పష్టంచేశారు. పాలమూరు గడ్డ నన్ను ఆదరించి, ఆశీర్వదించి అక్కున చేర్చుకుందని.. కొడంగల్ ప్రజల ఆశీర్వాదం వల్లే సీఎం అయ్యానని కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)