గీత రచయిత వైరముత్తు రచించిన 'మహా కివితై' పుస్తకావిష్కరణ ఇటీవల గ్రాండ్ గా జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం, కమల్ హాసన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే దీన్ని చిన్మయి ఖండించారు. మహిళలను వేధించిన వారికి మద్దతుగా పెద్ద మనుషులు ఉన్నారనే కోణంలో ఆమె ట్వీట్ చేశారు. దాంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. పుస్తకావిష్కరణ కార్యక్రమం గురించి ప్రముఖ టీవీ ఛానెల్ ట్వీట్ చేసింది. దీన్ని చిన్మయి రీట్వీట్ చేశారు. నన్ను వేధించిన వ్యక్తికి తమిళనాడులోని కొందరు శక్తివంతమైన వ్యక్తులు మద్దతు ఇస్తున్నారని ఆమె ఆరోపించింది. 2018లో చిన్మయి గీత రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతని ఆరోపణలు నిజం లేదంటూ ఆమెను ఐదేళ్ల పాటు తమిళ్ ఇండస్ట్రీ నుంచి నిషేధం విధించారు. దీనిపై విమర్శలు చేస్తూనే ఉంది చిన్మయి. గతంలోనూ కమల్ పై కామెంట్స్ చేశారు చిన్మయి. తాజాగా ఆమె చేసిన ట్వీట్ వైరల్ గా చక్కర్లు కొడుతోంది.
వేధించిన వ్యక్తికి సన్మానాలు చేస్తారా ?
January 02, 2024
0
Tags