మైసూర్‌ చాముండేశ్వరి ఆలయంలో రామ్ చరణ్ !

Telugu Lo Computer
0


హీరో రామ్ చరణ్ మైసూర్ లోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు చివర దశలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ సక్సెస్ తరువాత రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావడంతో.. అభిమానుల్లో గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాను ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా..ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)