అమెరికాలోని కాలిఫోర్నియాలో రాకాసి అలలు భయపెడుతున్నాయి. సునామీ తరహాలో ఎగసిపడుతున్నాయి. ఉరుములు మెరుపులతో పసిఫిక్ మహాసముద్రం అలజడిగా మారింది. రాకాసి అలలు 20 నుంచి 40 అడుగులు ఎగసి పడుతుండడంతో లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు రావచ్చని అధికారులు అప్రమత్తమయ్యారు. అలలు వేగంగా తీరాన్ని తాకుతుండడంతో వరద వచ్చే ముప్పు ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. మారీస్ కౌంటీ, కాపిటోలాను ఖాళీ చేయాలని హెచ్చరికలు జరీ చేసారు. అటు సాన్ డియాగో ప్రాంతం లోను అత్యంత భారీ అలలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జరీ చేసింది. సముద్రం ఒడ్డున ఎవరూ ఊండొద్దని విజ్ఞప్తి చేసారు. సముద్రం ఒడ్డుకుకూడా వెళ్లవద్దని సూచించారు. లాస్ ఏంజెల్స్ కూడా అలల ప్రమాదం పొంచి ఉందని వాతావరణశాఖ చెప్పింది. లాస్ ఏంజెల్స్ ప్రజలు అలలు, వరదల పట్ల జాగ్రత్తగా ఉండాలని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.
కాలిఫోర్నియాలో ఎగిసిపడుతున్న రాకాసి అలలు !
December 31, 2023
0
Tags