కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలో 13ఏళ్ల బాలిక పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తూ గుండెపోటు రావడంతో ఈరోజు మృతి చెందింది. ముదిగెర తాలూకాలోని కేశవులు జోగన్ననకెరె గ్రామానికి చెందిన 13 ఏళ్ల సృష్టి అనే బాలిక స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. దారదహల్లి ప్రాథమిక పాఠశాలకు వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. సృష్టిని ముదిగెరె పట్టణంలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తూ గుండెపోటుతో బాలిక మృతి !
December 20, 2023
0
Tags