ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లా జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాదిత్ గ్రామం డేరా బంజారా ప్రాంతంలోని ఒక గుడిసెలో ఒక కుటుంబం నిద్రించింది. శనివారం రాత్రి వేళ ఆ గుడిసెకు ఆకస్మికంగా మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో కాలి ఇద్దరు పిల్లలు మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ముగ్గురు పిల్లలను కాపాడేందుకు తండ్రి షకీల్ ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని పోలీసులు తెలిపారు.
గుడిసెకు నిప్పంటుకుని ముగ్గురు చిన్నారులు మృతి !
December 04, 2023
0
Tags