పాత అసెంబ్లీ బిల్డింగ్ లోనే కౌన్సిల్ సమావేశాలు !

Telugu Lo Computer
0


తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాత అసెంబ్లీ బిల్డింగ్ లో కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్న అసెంబ్లీలోనే శాసనసభ జరుగుతుందన్నారు. పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ఉండబోతోందని తెలిపారు. ఎంసీహెచ్ఆర్డీలో ఉన్న కాళీ స్థలంలో సీఎం క్యాంపు ఆఫీస్ నిర్మాణం చేస్తానని చెప్పారు. ప్రజా భవన్ లో ఇంకో బిల్డింగ్ ఉందని, అది ఇంకో మంత్రికి ఇస్తామని చెప్పారు. ప్రజాభవన్ లో ఉన్న ఆఫీసు కార్యాలయాన్ని ఉపయోగించుకుంటానని చెప్పారు. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని పేర్కొన్నారు. శాసనసభ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 12, 13 గంటలకు మించి విద్యుత్ ఇవ్వలేదన్నారు. శ్వేతపత్రాలు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని చెప్పారు. రేపు బీఏసీ సమావేశం ఉంటుందని దానిలో శాసనసభ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొత్త వాహనాలను కొనుగోలు చేసే ప్రసక్తే లేదని, రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టుకు మెట్రో ఉపయోగకరంగా ఉండదని అభిప్రాయపడ్డారు. మరో రూట్‌లో మెట్రో ప్లాన్ చేస్తామని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)