అయం సెమని బ్లాక్ చికెన్ ఇండోనేషియాకు చెందిన ప్రత్యేక రకం బ్లాక్ కాక్. ఈ బ్లాక్ చికెన్ ఇండోనేసియాలో చాలా ఫేమస్. దాని రక్తం తప్ప మిగతావన్నీ నల్లగా ఉంటాయి. పౌల్ట్రీ రంగంలోనే ఎంతో విలువైన ఈ బ్లాక్ చికెన్ ధర మార్కెట్లో కోడి 5వేల డాలర్ల అంటే రూ.3.7 లక్షల వరకు ఉంటుంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ 'కోపి లువాక్' దీన్ని సివెట్ కాఫీ అని కూడా అంటారు. అమెరికాలో ఒక్క కప్పుకాఫీకి దాదాపు రూ. 6 వేలు ఉంటుంది. సౌదీ అరేబియా, దుబాయ్, యూఎస్, యూరప్ వంటి దేశాల్లో సివెట్ కాఫీకి మంచి డిమాండ్ ఉంది. ఈ కాఫీ 1కేజీ ధర రూ. 20 నుంచి 25 వేల వరకు ఉంటుంది.
యుబారి పుచ్చకాయను జపాన్లోని హక్కైడో ద్వీపంలో ఉన్న యుబారి నగరంలో మాత్రమే పండిస్తారు. అందుకే దీనికి యుబారి మెలోన్ అని పేరు పెట్టారు. దీని ధర వేలల్లో కాదు లక్షల్లో ఉంటుంది. ఈ పండు కిలో ధరతో భారతదేశంలో 30 తులాల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. స్టేటస్ సింబల్ గా గిఫ్ట్ గా కూడా ఈ పండును ఇస్తారు.
కుంకుమపువ్వును ఎర్ర బంగారం అని కూడా పిలుస్తారు, కుంకుమపువ్వు, దేశంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం. ఒక కేజీ కాశ్మీర్ కుంకుమపువ్వు ధర రూ. 3 లక్షలు, ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం గా పేరు పొందింది. దాదాపు సంపన్నులు ఎక్కువగా ఉపయోగించే ఈ ఖరీదైన సుగంధ ద్రవ్యం ధర రోజురోజుకూ పెరుగుతోంది.