ధర్మ ప్రచారంలో భాగంగా వైట్ రేషన్ కార్డు ఉన్న భక్తులకు నెలకు ఒక రోజు ఉచిత సామూహిక సేవలు జరిపించుకునే అవకాశం శీశైలం దేవస్థానం కల్పించింది. ప్రతి నెలా ఒక రోజున జరిగే ఈ సేవలో 250 మంది భక్తులు పాల్గొన వచ్చు. అయిత ఈ సామూహిక సేవలో పాల్గొనాలని భావించే భక్తులు ముందస్తుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీశైలంలో ఉచిత సామూహిక సేవలో పాల్గొనాలని అనుకునేవారు ముందుగా www.srishailadevastanam.org వెబ్సైట్ విజిట్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఈ సామూహిక సేవలో దంపతులు లేదా ఒక్కరు కూడా పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ సేవలను యూట్యూబ్‌లో ఆలయానికి సంబంధించిన శ్రీశైల టీవీ ద్వారా భక్తులు వీక్షించొచ్చని కూడా తెలిపారు. ఈ సేవలు 2024 ఫిబ్రవరి 16 వరకు ప్రతి నెలలో ఒక రోజు జరగనున్నాయి. ఈ ఉచిత టికెట్ కావాలనుకునే భక్తులకు కచ్చితంగా తెల్లరేషన్‌కార్డు ఉండాల్సిందే. భక్తులు తమ తమ తెల్లరేషన్ కార్డును స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల 250మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అభిషేకం తర్వాత భక్తులు స్పెషల్ క్యూ లైన్లో స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనంతో పాటూ వృద్ధ మల్లికార్జునస్వామి దర్శనం చేసుకుంటారు. అలాగే ఈ సేవలో పాల్గొన్నవారికి రెండు లడ్డూ ప్రసాదాలు, విభూది, కైలాస కంకణాలు, కుంకుమ, శ్రీశైల ప్రభ, రవిక వస్త్రం, కాటన్ కండువాలను అందజేస్తారు. స్వామివారి దర్శనం అనంతరం దేవస్థానం అన్నపూర్ణ భవన్లో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు ఆలయ అధికారులు చెబుతున్నారు.
తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచిత సామూహిక సేవ !
December 03, 2023
0
Tags