డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు అంత త్వరగా గుర్తించలేము. శరీరంలో చాలా కాలం నుంచి ఆ వ్యాధి ఉన్నా వ్యాధి తీవ్రమైన తర్వాతనే లక్షణాలు బయట పడుతుంటాయి. టైప్ 2 మధుమేహం ఉందని చెప్పే లక్షణాల్లో ఒకటి తరచుగా మూత్ర విసర్జన. అలాగే షుగర్ లెవెల్స్ పడిపోయినప్పుడు ఆకలి వేస్తుంటుంది. ఈ వ్యాధి మరో లక్షణం ఆకస్మాత్తుగా బరువు తగ్గడం. ఇది చాలా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. రాత్రి బాగా నిద్రపోయినా.. మార్నింగ్ లేచిన తర్వాత కూడా అలసటగా అనిపిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు అలసట అనేది పోదు. కాబట్టి టైప్ 2 డయాబెటిస్ వచ్చిందని చెప్పే మరో లక్షణంగా నిద్రపోయినా ఆలసటగా ఉండడాన్ని చెప్పుకోవచ్చు. శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలు దెబ్బతిన్నప్పుడు కంటి చూపు మందగిస్తుంది. ఒకవేళ ఈ వ్యాధి తీవ్రంగా ఉంటే కళ్లు దెబ్బతిని గ్లకోమా వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొందరిలో డయాబెటిస్ ఉన్నట్లయితే చర్మం రంగు కూడా మారుతుంది. ఇంకొందరిలో అరికాళ్లలో మంటలు లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. డయాబెటిస్ ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే ఆ ప్రభావం ఇతర అవయవాలపై పడుతుంది. కిడ్నీలు దెబ్బతింటాయి. నాడీ వ్యవస్థపై ప్రభావం పడడం వల్ల నడవడం కూడా కష్టమవుతుంది. గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
టైప్ 2 డయాబెటిస్ - లక్షణాలు
December 15, 2023
0
Tags