పులిని పెంపుడు కుక్కలా తిప్పుతున్నబాలుడు !

Telugu Lo Computer
0


ఒక విలాసవంతమైన ఇంట్లో పెంపుడు పులిని గొలుసుతో కట్టేసి కుక్కను నడిపిస్తునట్టుగా ఒక బాలుడి వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఈ క్లిప్‌ను పాకిస్తానీ యూట్యూబర్ నౌమన్ హసన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేయగా విపరీతంగా వైరల్‌ అవుతోంది. వేలాది మంది వీక్షణలను సంపాదించింది. నౌమన్‌ ఇన్‌స్టాలో 9,55,000 మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు. యూట్యూబర్ నౌమన్‌ ఇన్‌స్టాలో తరచూ పులులు, పాములు, మొసళ్లకు సంబంధించిన అనేక వీడియోలను పోస్ట్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఈసారి షేర్‌ చేసిన వీడియోలో ఒక బాలుడు పులిని కట్టివేసిన గొలుసును పట్టుకుని ఒక లగ్జరీ బిల్డింగ్‌ లోపలే చుట్టూ తిరుగుతున్నాడు. ఈ చిన్న క్లిప్‌లో కనిపించిన ఆ బాలుడు క్రూర మృగాన్ని పట్టుకుని ఏ మాత్రం భయపడకుండా తిప్పుతున్నాడు. ఈ వీడియోపై చాలా మంది విమర్శలు గుప్పించారు. దీంతో ఇంటర్‌నెట్‌లో వీడియోపై తీవ్ర దుమారం మొదలైంది. ఐదు రోజుల క్రితం ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. చాలా మంది పాకిస్తానీ యూట్యూబర్ చిన్నారిని ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంచారని విమర్శించారు. మరికొందరు పులిని బంధించి, నిర్బంధించడాన్ని పలువురు ఖండించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)