నిజామాబాద్ అర్బన్ స్వతంత్ర అభ్యర్థి ఆత్మహత్య !

Telugu Lo Computer
0


తెలంగాణలోని నిజామాబాద్ అర్బన్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న యమగంటి కన్నయ్య గౌడ్ ఆత్మ హత్యకు పాల్పడ్డారు. అలియాన్స్ అఫ్ డెమొక్రటిక్ రిపబ్లిక్ పార్టీ నుండి పోటీ చేస్తున్న ఇతను నిన్న రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరౌతోంది. నాయకుడు అవుతాడని భావించిన వ్యక్తి కానరాని లోకాలకు వెళ్తాడనుకోలేదు అని కుటుంబ సభ్యులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. కన్నయ్య మరణానికి కారణం లోన్ యాప్ వేధింపులే అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అభ్యర్థిగా నిలబడిన కన్నయ్య ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)