కర్ణాటకలో దారుణం హత్య !

Telugu Lo Computer
0

ర్ణాటకలోని ఉడిపి జిల్లాలో మహిళ, ఆమె ముగ్గురు పిల్లలను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. ఆగంతకుడి కత్తి దాడిలో మరో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. ఆదివారం తెల్లవారుజామున కెమ్మన్ను ప్రాంతంలోని ఒక ఇంట్లోకి మాస్క్‌ ధరించిన వ్యక్తి చొరబడ్డాడు. ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేశాడు. కత్తి పోటు వల్ల 46 ఏళ్ల హసీనా, 23, 21, 12 ఏళ్ల వయసున్న ఆమె ముగ్గురు పిల్లలు మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఉడిపి జిల్లా ఎస్పీ అరుణ్ కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతురాలి భర్త గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసిందన్నారు. మహిళ, ఆమె ముగ్గురు పిల్లల హత్యకు కారణం ఏమిటన్నదని తెలియదని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)