గురుపత్వంత్ సింగ్ పన్నూ వ్యాఖ్యలపై విచారణ జరుపుతాం !

Telugu Lo Computer
0


లిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ (ఎస్‌జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల భారత్‌ను బెదిరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 19న ఎయిరిండియా విమానాల్లో సిక్కులు ఎవరూ ప్రయాణించొద్దని, ప్రయాణిస్తే ప్రాణాలకు భద్రత ఉండదని, ప్రపంచవ్యాప్తంగా ఆ విమానాలను ఎక్కడా అనుమతించబోమని హెచ్చరించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం మూతపడుతుందని, దాని పేరు మారుస్తామని హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలపై కెనడా స్పందించింది. గురుపత్వంత్ సింగ్ పన్నూ వ్యాఖ్యలపై విచారణ జరుపుతున్నట్లు కెనడా ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కెనడా రవాణా శాఖ మంత్రి పాబ్లో రోడ్రిగ్జ్ శుక్రవారం మాట్లాడుతూ మేం ప్రతి ముప్పును తీవ్రంగా పరిగణిస్తున్నాం, ముఖ్యంగా విమానయాన సంస్థలను హెచ్చరిస్తూ వచ్చిన బెదిరింపులపై కెనడా విచారణ జరుపుతున్నట్లు రోడ్రిగ్జ్ తెలిపారు. ఇదిలా ఉంటే ఖలిస్తాన్ ఉగ్రవాది బెదిరింపుల నేపథ్యంలో ఢిల్లీ, పంజాబ్ విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. కెనడాలో దాదాపు 7 లక్షల మంది సిక్కులు ఉన్నారు. వీరు కెనడాలో జనాభాలో 2 శాతం ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)