హైదరాబాద్ లో చంద్రబాబుపై కేసు నమోదు !

Telugu Lo Computer
0


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ ఆయనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో అరెస్టై బెయిల్‌పై మంగళవారం విడుదలైన ఆయన బుధవారం హైదరాబాద్​కు చేరుకున్నారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ లోని బాబు నివాసం వరకూ ర్యాలీ నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. అంబులెన్స్ లకు సైతం దారి ఇవ్వకుండా కార్యకర్తలు అడ్డదిడ్డంగా వాహనాలను నడిపారు. దీంతో కోడ్ ను ఉల్లంఘించారంటూ బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)