అమెరికాలో ఘనంగా దీపావళి వేడుకలు

Telugu Lo Computer
0


మెరికా ప్రభుత్వం దీపావళిని పండుగగా గుర్తించి పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో న్యూజెర్సీలోని ఎడిసన్‌లో దీపావళి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగనున్నాయి. వైట్ హౌస్ దీపావళి దీపావళి వేడుకలకు అందంగా ముస్తాబైంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి చేసేందుకు సిద్ధమైయ్యారు. ఈసారి దీపావళి పండగ నవంబర్ 10 వ తేదీ నుంచి నవంబర్ 15 వ తేదీవరకు అమెరికాలో ఘనంగా జరుగనున్నాయి. అక్కడ జరిగే అతి పెద్ద పండుగలైన హాలోవిన్, థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్ లాంటి పండుగల తర్వాత ఆ స్థాయిలో ఈ దీపావళి పండుగను అమెరికాలో నిర్వహించేందుకు అక్కడున్న భారతీయులు సిద్దమయ్యారు. ఈ పండగల రోజు అమెరికాలో సెలవు కూడా ప్రకటిస్తూ ఉంటారు. దీపావళి పండుగ సందర్భంగా కూడా అమెరికాలో సెలవు ప్రకటించారు. అమెరికాలో దీపావళి పండగను అంత భారీగా జరుపుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అమెరికాలో నివసించే భారతీయుల సంఖ్య అధికంగా ఉంటుంది కాబట్టి దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. దీంతోపాటు దీపావళి అంటేనే దీపాలు, పూజలు, బాణసంచా, గిఫ్ట్‌లు ఉంటాయి. దీంతో ఈ పండగ కమర్షియల్‌గా కూడా చాలా బిజినెస్ చేస్తుంది. ఈ రెండు కారణాల వల్లే అమెరికాలో దీపావళి ఘనంగా చేస్తారు. ఇక గతేడాది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక విషయాన్ని వెల్లడించారు. 2023 దీపావళి పండుగను అమెరికా అధ్యక్షుడి నివాసమైన వైట్‌హౌస్‌లో తన కుటుంబంతో కలిసి నిర్వహించుకోనున్నట్లు ప్రకటించారు.




Post a Comment

0Comments

Post a Comment (0)