ఆఫ్రికా దేశం ఉగాండా క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిదగిన సందర్భం. అంచనాలను తలకిందులు చేస్తూ ఉగాండా క్రికెట్ జట్టు వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆఫ్రికా రీజియన్ క్వాలిఫయర్ – 2023 పోటీలలో ఆ జట్టు గురువారం రువాండాను ఓడించడంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్రపంచకప్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఐసీసీ మెగా టోర్నీలో ఉగాండా ఆడనుండటం ఇదే ప్రథమం. ఆఫ్రికన్ రీజియన్ క్వాలిఫయర్స్‌లో భాగంగా ఏడు దేశాలతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఇదివరకే నమీబియా ఆడిన ఐదు మ్యాచ్‌లకూ ఐదింటిని గెలుచుకుని పది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఉగాండా జట్టు ఆరు మ్యాచ్‌లలో ఏకంగా ఐదు గెలిచి పది పాయింట్లతో రెండో స్థానలో ఉంది. ఈ టోర్నీలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్లు వరల్డ్ కప్‌కు క్వాలిఫై అవుతాయని ఇదివరకే ఐసీసీ వెల్లడించిన విషయం తెలిసిందే.
టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన ఉగాండా
November 30, 2023
0
Tags