ఉత్తరప్రదేశ్లోని సెంట్రల్ నోయిడా ఎకోటెక్ పోలీస్ స్టేషన్ పరిధిలో హబీబ్పూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల పింకీ తన ఇంట్లో ఓ గదిలో నిద్రిస్తుండగా, గుర్తు తెలియని హంతకుల చేతిలో దారుణ హత్యకు గురైంది. హత్య చేసిన విధానం చూస్తే ఇటుకలు, రాళ్లతో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సెంట్రల్ నోయిడా డీసీపీ సునీతి సింగ్ మాట్లాడుతూ హత్యకు గల కారణాలపై బాలిక కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారిని విచారిస్తున్నామన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత హత్యకు గల కారణాలు తెలుస్తాయని డీసీపీ పేర్కొంది. అయితే మృతురాలికి పెళ్లి సంబంధం కుదిరిందని, డిసెంబర్ లో వివాహం జరగాల్సి ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు బాలిక హత్యకు గురైనప్పుడు కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఈ హత్య ఘటన రాత్రి జరిగితే మరుసటి రోజు మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు హత్యకు సంబంధించి పోలీసులు కుటంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నిద్రిస్తున్న బాలికను రాళ్లతో కొట్టి చంపిన దుండగులు !
October 01, 2023
0
Tags