చంద్రబాబు బెయిల్‌ పిటిషన్లు కొట్టి వేసిన హైకోర్టు !

Telugu Lo Computer
0


టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టి వేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టై 30 రోజులుగా జైల్లోనే ఉన్నారు. అమరావతి రింగ్‌ రోడ్డు, ఫైబర్‌నెట్‌, అంగళ్లు కేసుల్లో కూడా డీమ్డ్‌ కస్టడీగా చూడాలనే వాదనను హైకోర్టు  తోసిపుచ్చింది. ఫైబర్‌ నెట్‌ కేసులోనూ ముందస్తు బెయిల్ పిటిషన్‌ డిస్మిస్‌ చేసింది. ఫైబర్‌ నెట్‌ కేసులో A-24గా ఉన్నారు చంద్రబాబు. ఇన్నర్‌ రింగు రోడ్డు కేసులో A-1గా ఉన్నారు చంద్రబాబు. అంగళ్లు కేసులో A1గా కూడా ఉన్నారు చంద్రబాబు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకి వెళ్లేందుకు చంద్రబాబుకు అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)