ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడుతూ విశాఖ నుంచి త్వరలోనే పాలన కొనసాగిస్తానని, డిసెంబర్‌లోగా విశాఖకు షిఫ్ట్ అవుతానని, పరిపాలనా విభాగం అంతా ఇక్కడికే మారుతుందన్నారు. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్‌గా మారిందన్న ముఖ్యమంత్రి, ఐటీ హబ్‌గా కూడా మారబోతుందన్నారు. ఇవాళ విశాఖ, అనకాపల్లిలో జిల్లాలో పర్యటించారు. విశాఖలో ఐటీ సెజ్ హిల్ నెంబర్ 2లోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత ఫార్మాసిటీలో కొత్తగా నిర్మించిన యూజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని, లారస్ ల్యాబ్స్‌లో నిర్మించిన అదనపు భవనాలను, యూనిట్ 2 ఫార్ములేషన్ బ్లాక్, ఎల్ఎస్‌పీఎల్ యూనిట్ 2ను ప్రారంభించారు.
డిసెంబర్‌లోగా విశాఖకు షిఫ్ట్ అవుతా !
October 16, 2023
0
Tags