ముంబయి లోకల్ ట్రైన్ లో ప్రయాణికులు తమ రోజువారి ప్రయాణాన్ని సందడిగా మార్చుకున్నారు. నవరాత్రుల వేళ ప్రయాణికులు గర్బా డ్యాన్స్‌కి స్టెప్పులు వేసారు. వీరి డ్యాన్స్ వీడియో వైరల్ కావడంతో పాటు నెటిజన్ల మనసు దోచుకుంది. ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటే ముంబయి సిటీలో నవరాత్రి వేళ ప్రయాణికులు తమ ఆనందాన్ని ఇలా పంచుకునేందుకు ప్రయత్నించారు. యువకుల నుండి వృద్ధుల వరకు ట్రైన్‌లో గర్బా డ్యాన్స్ చేసారు. కొందరు వారిని ఉత్సాహ పరిచారు. @mumbaiheritage అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో నెటిజన్ల ప్రశంసలు పొందింది. ముంబయి లోకల్ ట్రైన్‌లో ప్రయాణికులు గర్బా డాన్స్ చేయడం వైరల్‌గా మారింది. ముంబయి లోకల్ ట్రైన్‌లో గర్బా వావ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. తమకి కూడా ఈ డ్యాన్స్‌లో పాల్గొనాలనిపించింది అని మెసేజ్ చేసారు.
ముంబయి లోకల్ ట్రైన్ లో గర్బా డాన్స్ వైరల్ !
October 22, 2023
0
Tags