ఖరగ్‌పూర్‌ ఐఐటిలో విద్యార్థి ఆత్మహత్య

Telugu Lo Computer
0

శ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలోని ఖరగ్‌పూర్‌లో ఐకానిక్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి)లోని విద్యార్థుల హాస్టల్ నుండి బుధవారం అనుమానాస్పద పరిస్థితుల్లో నాల్గవ సంవత్సరం విద్యార్థి తెలంగాణ వాసి కె కిరణ్ చంద్ర మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కిరణ్ మరణానికి కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదని పోలీసులు వెల్లడించారు. మృతుడు అతని హాస్టల్ లో ఉరివేసుకుని కనిపించాడు. అతన్ని ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మిడ్నాపూర్ మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. ఇది ఆత్మహత్యగా ప్రాథమికంగా భావించినప్పటికీ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)