ఐసీసీ మూడు కొత్త రూల్స్ !

Telugu Lo Computer
0


భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే  ప్రపంచకప్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా టీమిండియా బరిలోకి దిగబోతోంది. ఈ ప్రపంచకప్ భారతదేశానికి చాలా పేరు తేవడం పక్కా. దీనికి మొదటి కారణం మెగా టోర్నమెంట్‌ని నిర్వహించడం. రెండో కారణం.. చరిత్రలో తొలిసారిగా భారత్‌ మాత్రమే ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఇది మాత్రమే కాదు.. ఈసారి ప్రపంచ కప్‌లో అభిమానులు త్రిబుల్ డోస్ థ్రిల్‌ను చూడగలరు. మెగా టోర్నమెంట్‌లో 3 కొత్త రూల్స్ ఉన్నాయి. ఇవి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేయబోతున్నాయి. 

1. ICC బౌండరీల కోసం నియమాలను నిర్దేశించింది

భారతదేశంలోని చాలా స్టేడియాల్లో పరుగుల వరద పారుతుంది. బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోతారు. దానికి కారణం బౌండరీలు చాలా చిన్నవి కావడం. అయితే ఈసారి చరిత్రలో తొలిసారిగా భారత్‌లోని కొన్ని వేదికల కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బౌండరీ నిబంధనలను సిద్ధం చేసింది. ఈ స్టేడియాల్లో 70 మీటర్ల కంటే తక్కువ ఉండకూడదని.. అంతకంటే ఎక్కువగా ఉండాలని తెలిపింది. దీంతో.. బంతికి, బ్యాట్ కు జరిగే సమరం మరింత కిక్ ఇవ్వనుంది.

2. సాఫ్ట్ సిగ్నల్ రూల్ కి టాటా

ప్రపంచ కప్‌కు ముందు.. అంపైరింగ్ నియమాన్ని కూడా మార్చారు. ఐసీసీ సాఫ్ట్ సిగ్నల్ నిబంధనను రద్దు చేసింది. సాఫ్ట్ సిగ్నల్ రూల్‌ విషయంలో అంపైర్ ఏదైనా వికెట్ కోసం థర్డ్ అంపైర్ సహాయం తీసుకోవాలనుకుంటే.. మొదట సెకండ్ అంపైర్‌తో మాట్లాడిన తర్వాత అతను తన నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు ఇవ్వాలి. అటువంటి పరిస్థితిలో.. థర్డ్ అంపైర్ కూడా ఆ వికెట్‌ను సరిగ్గా పరిశీలించడంలో విఫలమైతే.. అప్పుడు మైదానంలో అంపైర్ నిర్ణయం పరిగణించబడుతుంది. ఇది చాలా వివాదాస్పదంగా మారింది. దీంతో జూన్‌లో ఈ నిబంధనను రద్దు చేశారు. ఇప్పుడు స్ట్రాండ్డ్ వికెట్‌పై తుది నిర్ణయం ఫుటేజీ ఆధారంగా థర్డ్ అంపైర్ తీసుకోనున్నారు.

3. బౌండరీ కౌంట్ రూల్ కూడా రద్దు చేయబడింది

2019 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఇదే రూల్ చర్చకు వచ్చింది. న్యూజిలాండ్ మరియు ఇంగ్లండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో.. బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా నిలిపారు. ఈ నిబంధన ప్రకారం మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ నిర్వహిస్తారు.అయితే సూపర్ ఓవర్‌లో కూడా మ్యాచ్ టై అయినట్లయితే, ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. అయితే ఇప్పుడు ఈ నిబంధన ప్రపంచకప్‌లో కనిపించదు. సూపర్ ఓవర్ టై అయితే మ్యాచ్ డిసైడ్ అయ్యే వరకు సూపర్ ఓవర్లు ఆడాల్సి ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)