పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్దామన్ జిల్లా మంగళకోట్‌లోని కుర్తుబా గ్రామానికి చెందిన మన్సూర్ అలీ షేక్ అనే వ్యక్తి చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే, తన దుకాణం పక్కన నిల్వ ఉన్న నీటిలో దోమల బెడద ఎక్కువ ఉంది. డెంగీ కేసులతో ఆందోళన చెందిన మన్సూర్ భయంతో తనను కుట్టిన 25, 30 దోమలను చంపి వాటన్నింటిని ఓ పాలిథిన్ బ్యాగ్‌లో వేసి ఆసుపత్రికి తీసుకొచ్చాడు. అది చూసిన డాక్టర్‌తో సహ అక్కడున్నవారంతా ఆశ్యర్చపోయారు. దోమలను వైద్యుడికి చూపి ఈ దోమలను పరీక్షించి తనకు సరైన వైద్యం చేయాలంటూ కోరాడు. ఈ ఘటనపై స్పందించిన స్థానిక అధికారులు తక్షణమే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తామని తెలిపారు.
కుట్టిన దోమలను ఆస్పత్రికి పట్టుకొచ్చిన వ్యక్తి !
October 07, 2023
0
Tags