నార్గిస్‌ మొహమ్మదికి నోబెల్‌ శాంతి బహుమతి

Telugu Lo Computer
0


నోబెల్‌ శాంతి బహుమతి ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గిస్‌ మొహమ్మది ఎంపికైంది. ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటానికి గానూ ఈ అవార్డును అందజేస్తున్నట్లు నార్వే నోబెల్‌ కమిటీ ప్రకటించింది. మానవ హక్కులు, ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ కోసం గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న నార్గిస్‌ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. సంప్రదాయం పేరుతో మహిళలకు అనేక ఆంక్షలు విధించే ఇరాన్‌ లాంటి దేశంలో పుట్టిన నార్గిస్‌  చదువుకునే రోజుల నుంచే మహిళా హక్కులపై గళమెత్తారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం పలు వార్తాపత్రికలకు కాలమిస్ట్‌గా పనిచేశారు. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత షిరిన్‌ ఇబాది స్థాపించిన డిఫెండర్స్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ (డీహెచ్‌ఆర్‌సీ) సెంటర్‌లో 2003లో చేరి ఆ తర్వాత అదే సంస్థకు ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. హక్కుల కోసం ఆమె చేస్తున్న పోరాటంలో ఎన్నోసార్లు కఠిన సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయలేదు. ఈ క్రమంలోనే 13 సార్లు అరెస్టయ్యారు. ఐదుసార్లు జైలు శిక్షలను ఎదుర్కొన్నారు. 1998లో ఇరాన్‌ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గానూ తొలిసారి అరెస్టయి ఏడాదిపాటు జైలుశిక్షను అనుభవించారు. ఆ తర్వాత డీహెచ్‌ఆర్‌సీలో చేరినందుకు గానూ మరోసారి అరెస్టయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)