గ్రెగ్ చాపెల్ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గ్రెగ్‌ను ఆదుకోవడం కోసం అతడి స్నేహితులు విరాళాల సేకరణ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందుకోసం స్పెషల్ డిన్నర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే మేటి ఆల్‌రౌండర్లలో ఒకడిగా.. గొప్ప బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా రిటైరైన చాపెల్ ఇప్పుడు విరాళాల సేకరణ మీద ఆధారపడ్డాడన్న వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చాపెల్ ఈ పరిస్థితుల్లో ఉండటం స్వయంకృతమే అన్న చర్చ జరుగుతోంది. డాన్ బ్రాడ్‌మన్‌ను ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప బ్యాటర్లలో ఒకడిగా పేర్కొంటారు. ఆస్ట్రేలియా తరఫున అత్యధిక టెస్టు పరుగులతో (6996) బ్రాడ్‌మన్ నెలకొల్పిన రికార్డును తాను రిటైరయ్యే ముందే గ్రెగ్ చాపెల్ (7110) బద్దలు కొట్టాడు. టెస్టులతో పాటు వన్డేల్లోనూ తన పేస్ బౌలింగ్‌తో ఆ కాలంలో మేటి ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరు సంపాదించాడు. 47 టెస్టుల్లో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించిన గ్రెగ్.. 21 విజయాలు అందించి ఉత్తమ కెప్టెన్‌గానూ పేరు సంపాదించాడు. ఐతే గణాంకాల పరంగా గొప్ప ఆటగాడే అయినా వ్యక్తిత్వ పరంగా గ్రెగ్‌కు అంత మంచి పేరేమీ లేదు. 1981లో న్యూజిలాండ్‌తో జరిగిన ఒక వన్డే మ్యాచ్‌లో జట్టును గెలిపించడం కోసం తన తమ్ముడు ట్రెవర్ చాపెల్‌తో అండర్ ఆర్మ్ బౌలింగ్ చేయించి క్రికెట్ ప్రపంచంతో ఛీ కొట్టించుకున్నాడు గ్రెగ్ చాపెల్. ఈ ఉదంతం అతడి కెరీర్లో చెరగని మచ్చగా మిగిలిపోయింది.
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో గ్రెగ్ చాపెల్ !
October 27, 2023
0
Tags