ఛత్తీస్‌గఢ్‌లో భాజపా కార్యకర్త హత్య

Telugu Lo Computer
0

త్తీస్‌గఢ్‌ లో భాజపా కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రంలోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన మోహ్లా మన్‌పుర్‌ అంబగఢ్‌ చౌకీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఔందీ గ్రామానికి చెందిన భాజపా కార్యకర్త బిర్జు తారమ్ (60) సాయంత్రం వేళ బయటకు వెళ్లారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయనపై దాడికి దిగారు. తుపాకీతో కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో తారమ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్నికల ముందు ఈ హత్య జరగడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. దీనిపై రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అరుణ్ సావో స్పందిస్తూ.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. భాజపా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఈ హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు భాజపా నేతలు భయపడరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గద్దె దించుతామన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ హత్య చోటు చేసుకోవడం తొలిసారి కాదు. గతంలో బీజాపుర్‌, బస్తర్‌ డివిజన్‌, నారాయణపుర్‌ జిల్లాల్లో భాజపా నేతలు హత్యకు గురయ్యారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)