ఈస్ట్ జెరూసలేం రాజధానిగా ప్రత్యేక పాలస్తీనా !

Telugu Lo Computer
0


మాస్కోలో ఏర్పాటైన కామన్‌వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ సమ్మిట్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగిస్తూ ప్రత్యేక పాలస్తీనా దేశాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందని, అప్పుడే ఈ సుదీర్ఘ సంక్షోభానికి తెర పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ దేశానికి ఈస్ట్ జెరూసలేం నగరాన్ని రాజధానిగా ప్రకటించాలని సూచించారు. ఈ సంక్షోభాన్ని నివారించడంలోొ- దీనికి మించిన ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారాయన. పాలస్తీనీయన్ హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడులు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. తనను తాను కాపాడుకోవడానికి ప్రతిదాడులు చేసే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని అన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని, ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని పుతిన్ అన్నారు. ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య చర్చలకు ఐరాస సారథ్యాన్ని వహించాలని పేర్కొన్నారు. ప్రత్యేక దేశం అనే ప్రతిపాదనలపై సానుకూల వాతావరణంలో చర్చలను చేపట్టాలని చెప్పారు. ఇజ్రాయెల్‌తో కలిసి పాలస్తీనియన్లు శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈ ప్రతిపాదనలు ఉపకరిస్తాయని పుతిన్ వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)