ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద ట్విట్టర్ వేదికగా పాముకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. వీడియో ప్రకారం.. ఓ మహిళ తన ఇంటి ముందు షూను వదిలేసింది. ఇక అందరి కళ్లుగప్పి నాగుపాము షూలోకి దూరింది. సదరు మహిళ షూ వేసుకునేందుకు యత్నించగా, బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. ఇంతలో షూను కదిలించగా, పడగ విప్పి బయటకు వచ్చింది. దీంతో ఆమె హడలిపోయింది. దూరంగా పరుగెత్తింది. కాసేపటికే నాగుపాము అటు నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
'షూ'లో నాగుపాము !
October 10, 2023
0
Tags