ఎన్నికలలో తాను కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో ఉంటానని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రకటించారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో నేడు పర్యటించిన ఆయన తను కామారెడ్డి నుండి పోటీ చేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను కామారెడ్డి వదిలిపోనని స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి, నిజామాబాద్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తాను పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, ఇది తనపై కావాలని జరుగుతున్న దుష్ప్రచారం అని ఆయన అన్నారు. తాను ఎవరికీ భయపడవలసిన అవసరం లేదని, కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని షబ్బీర్ అలీ ప్రకటించారు. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి అభ్యర్థిగా షబ్బీర్ అలీ పేరు ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో లేకపోవడంతో, షబ్బీర్ అలీ అక్కడ నుండి చేయడం లేదని ప్రచారం జరిగింది. కామారెడ్డి నుండి షబ్బీర్ అలీ కాకుండా రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని కూడా జోరుగా ప్రచారం సాగింది.
కామారెడ్డి నుండే పోటీ చేస్తా ?
October 23, 2023
0
Tags