గాడిద పాలకు మంచి డిమాండు ఉంది. లీటరు రూ.8 వేలకు పైగానే పలుకుతోంది. విజయవాడలో వీధివీధి తిరుగుతూ కావాల్సిన వాళ్లకు పాలు పిండి ఇస్తున్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నుంచి 4 కుటుంబాల వారు కొన్ని గాడిదలు తీసుకొని విజయవాడకు వచ్చారు. నగరంలో ఇంటింటికీ వాటిని తిప్పుతూ పాలు పితికి విక్రయిస్తున్నారు. ఈ పాలు తాగితే ఉబ్బసం, శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. 20 మి.లీ. ఉన్న చిన్న గిద్దెడు పాలకు రూ.150 తీసుకుంటున్నారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ వాంబే కాలనీ రహదారిలో గాడిదలతో కనిపించిన వారిని పలకరించగా ''ఏడాదిలో 8 నెలలు వివిధ ప్రాంతాల్లో తిరుగుతాం. 4 నెలలు ఇంటి వద్ద ఉంటాం. రోజుకు లీటరు పాలు ఇచ్చే కాటేవాడి గాడిద రూ.1.20 లక్షలు ఉంటుంది. ఇవి ఏడాదంతా పాలు ఇస్తాయి. తమ కుటుంబ పోషణకు ఇవే ఆధారం' అని వివరించారు.
గాడిద పాలు లీటరు రూ.8 వేలు !
October 04, 2023
0
Tags