ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. అంతకుముందు చంద్రబాబు తరఫు న్యాయవాది లూథ్రా వాదనలు వినిపిస్తూ ఫైబర్ నెట్ కేసులో ముగ్గురికి ముందస్తు బెయిల్ వచ్చిందని తెలిపారు. ఇద్దరికి రెగ్యులర్ బెయిల్ వచ్చిందని, మరికొంతమంది ప్రస్తావన లేదన్నారు. కొందరికి ముందస్తు బెయిల్, మరి కొంతమందికి రెగ్యులర్ బెయిల్ ఉన్నప్పుడు మా క్లయింట్‌కు బెయిల్ ఎందుకివ్వరని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ కేసులో సెక్షన్ 17ఏ ప్రస్తావన కూడా ఉన్నందున తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ అనిరుద్ద బోస్ తెలిపారు. ''మంగళవారానికి విచారణ వాయిదా వేయడం వల్ల ప్రయోజనం లేదు. చంద్రబాబును సోమవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నారు. కోర్టులో హాజరుపరిచాక ముందస్తు బెయిల్ అన్నపదమే ఉత్పన్నం కాదు'' అని లూథ్రా కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై జస్టిస్ బోస్ స్పందిస్తూ.. మేం ఆర్డర్ పాస్ చేయట్లేదు గానీ.. సోమవారం వరకు అరెస్టు చేయవద్దని చెప్పండి అని సీఐడీ తరఫు న్యాయవాది రోహత్గీకి సూచించారు. అరెస్టు చేయకపోతే ముందస్తు బెయిల్ నిరర్థకం కదా అని వ్యాఖ్యానించారు. 17ఏపై ఇంకా వాదనలు పూర్తి కానందున ఫైబర్ నెట్ కేసులో ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టులో ఫైబర్ నెట్ కేసును బుధవారానికి వాయిదా వేయాలని సమాచారమిస్తామని సీఐడీ తరఫు న్యాయవాది రోహత్గీ కోర్టుకు తెలిపారు.
ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ 17కి వాయిదా !
October 13, 2023
0
Tags