ప్యాసింజర్ రైలుతో గూడ్స్​ రైలు ఢీకొన్న ఘటనలో 13 మంది మృతి

Telugu Lo Computer
0


బంగ్లాదేశ్​ రాజధాని ఢాకా సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 13 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. రెండు రైళ్లు పరస్పరం ఢీకొనడం వల్ల ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు సాగుతున్నాయని చెప్పారు. అధికారుల సమాచారం ప్రకారం.. సోమవారం సాయంత్రం 4.15గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కిశోర్​గంజ్​ నుంచి ఢాకాకు వెళ్తున్న రైలు.. వెనుక నుంచి గూడ్స్ రైలును ఢీకొట్టింది. వెంటనే రెండు భోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. వీటి కింద కొందరు ప్రయాణికులు చిక్కుకుపోయారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)