హమాస్‌కు చెందిన 10 మంది సభ్యులపై అమెరికా ఆంక్షలు !

Telugu Lo Computer
0

జ్రాయెల్‌పై దాడి నేపథ్యంలో హమాస్‌కు చెందిన 10 మంది సభ్యులతోపాటు గాజా, సుడాన్‌, తుర్కియే, అల్జీరియా, ఖతార్‌లోని ఆ సంస్థకు చెందిన ఆర్థిక మూలాలపై అమెరికా ఆంక్షలు విధించింది. హమాస్‌ పెట్టుబడుల పోర్టుపోలియో నిర్వహించే వ్యక్తులు, ఇరాన్‌ ప్రభుత్వంతో దగ్గరి సంబంధాలు కలిగిన ఖతార్‌కు చెందిన ఫైనాన్సియర్‌, హమాస్‌ కీలక కమాండర్‌, గాజా కేంద్రంగా పని చేసే కొందరు హమాస్ సభ్యుల లక్ష్యంగా ఆంక్షలు విధించినట్లు అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌పై దాడుల నేపథ్యంలో హమాస్‌కు నగదు సమకూర్చే వారిపై వేగంగా, నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి జానెట్‌ యెల్లెన్‌ తెలిపారు. అంతర్జాతీయ వ్యవస్థల ద్వారా హమాస్‌ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందకుండా అడ్డుకుంటామని అమెరికా సహాయ మంత్రి బ్రియాన్‌ నెల్సన్‌ తేల్చి చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం అంతర్జాతీయ వ్యవస్థ ద్వారా నిధుల ప్రవాహాన్ని తాము సహించమని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)