ఆప్ఘనిస్థాన్‌లో స్వల్ప భూకంపం !

Telugu Lo Computer
0


ప్ఘనిస్థాన్‌లోని ఫైజాబాద్‌లో భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 7.08 గంటలకు ఫైజాబాద్‌లో  స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.4గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ ప్రకటించింది. ఫైజాబాద్‌కు 196 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూ అంతర్భాగంలో 158 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)