హైదరాబాద్‍లోని పలుచోట్ల జల్లులు

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం నుంచి చిరు జల్లులు కురుస్తున్నాయి. బోరబండ, మోతినగర్ ఎస్సార్ నగర్, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డికపూల్, మాదాపూర్, జూబ్లీహిల్స్ లో చిరు జల్లులు కురిశాయి. ఈ రోజు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.హైదరాబాద్‌లో మధ్యాహ్నం, సాయంత్రం వర్షం పడుతుందని అంచనా అంచనా వేసింగి. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా ఇదే వాతావరణం ఉంటుందని పేర్కొంది. మరోవైపు హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈరోజు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌కు సంబంధించి నగరంలోని మొత్తం ఆరు మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)