నాగ సుశీలపై పోలీస్ కేసు !

Telugu Lo Computer
0


క్కినేని నాగేశ్వరరావు కూతురు, హీరో నాగార్జున సోదరి నాగ సుశీలపై మొయినాబాద్ పీఎస్ లో కేసు నమోదయ్యింది. శ్రీజ ప్రకృతి దర్శపీఠం ఆశ్రమంపై దాడి చేశారని బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 12న నాగసుశీల మరికొంత మంది కలిసి శ్రీనివాసరావు ఇంటిపై దాడి చేశారని ఆరోపిస్తూ కంప్లైంట్ ఇవ్వడంతో ఘటనపై మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.నాగసుశీల, శ్రీ నాగ్ ప్రొడక్షన్ మేనేజింగ్ పార్ట్ నర్ చింతలపూడి శ్రీనివాస్ మధ్య గత కొన్నేళ్లుగా భూవివాదాలు ఉన్నాయి. వీళ్లిద్దరు చాలా ఏళ్లుగా వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. వీరిద్దరూ కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతో పాటు సినిమాలు కూడా నిర్మించారు. తనకు తెలియకుండా శ్రీనివాస్ తన భూములను విక్రయించాడని నాగసుశీల గతంలో పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే లాకప్‌లో పెట్టయినా తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకునేందుకే తనపై నాగ సుశీల కేసు పెట్టారని శ్రీనివాస్ ఆరోపించారు. నాగ సుశీల కుమారుడు సుశాంత్ హీరోగా నాలుగు సినిమాలు తీసి భారీగా నష్టపోయామని అన్నారు. ఈ వివాదాల కారణంగా శ్రీనివాస్ నాగసుశీలపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)