తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులపాటు వర్షాలు !

Telugu Lo Computer
0


శాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటలుగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రోడ్లన్ని జలమయమయ్యాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ఇవాళ బలపడి అల్పపీడనంగా మారనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్‌లు జారీ చేసింది. 9 జిల్లాలకు ఆరెంజ్‌, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్రలో రానున్న నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు కోస్తాంధ్ర, యానాంకు ఐఎండీ ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. 11.5 సెం.మీ నుంచి 20.44 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది


Post a Comment

0Comments

Post a Comment (0)