సమృద్ధి-మహామార్గ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రమాదాలుపై అజిత్ పవార్‌ వింత వ్యాఖ్యలు !

Telugu Lo Computer
0


మృద్ధి-మహామార్గ్‌ ఎక్స్‌ప్రెస్‌పై తరచూ ప్రమాదాలు చోటుచేసుకోవడంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు వింతగా ఉన్నాయి. ఛత్రపతి శంబాజీ నగర్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరైన అజిత్‌ విలేకరులతో మాట్లాడుతూ 'సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే రోడ్లు ఎలాంటి వంపులు లేకుండా తిన్నగా ఉంటాయి. అందుకే డ్రైవర్లకు నిద్రమత్తుగా అనిపిస్తుంటుంది. దాంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కారణం ఏదైనా సరే ఈ ప్రమాదాలను కట్టడి చేయాల్సి ఉంది' అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మరాఠా రిజర్వేషన్ల గురించి మాట్లాడారు. ఈ విషయంలో విపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. 'ఇతర వర్గాల రిజర్వేషన్లను కదపకుండా మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడానికి మా ప్రభుత్వం అనుకూలంగా ఉంది' అని అన్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన అఖిలపక్ష భేటీలో మరాఠాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. అలాగే ఈ అంశం చట్టపరంగా చెల్లుబాటు అయ్యేలా కృషి చేస్తున్నామన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)