సైమా వేదికపై ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్ !

Telugu Lo Computer
0


2023 సైమా ఈవెంట్ లో ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకున్నాడు. ఈ సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు డై హార్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఎమోషనల్ చేస్తుంది. తన ప్రతి కష్టం సుఖంలో ఉండి… తనతో పాటే సాగుతున్న అభిమానులని ఉద్దేశించి ఎన్టీఆర్ “నా ఒడిదుడుకుల్లో, నేను క్రిందపడ్డప్పుడళ్ళా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు, నా కనుల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా భాద పడినందుకు, నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు వాళ్ళు కూడా నవ్వినందుకు, నా అభిమాన సొదరులందరికి పాదాభి వందనాలు” అంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. నిజానికి ఎన్టీఆర్ తన ప్రతి స్పీచ్ లో ఫ్యాన్స్ ని ఉద్దేశించి చాలా ఎమోషనల్ గా మాట్లాడుతాడు కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల రీత్యా ఎన్టీఆర్ స్పీచ్ చాలా స్పెషల్ గా నిలిచింది.

Post a Comment

0Comments

Post a Comment (0)