చంద్రబాబు అరెస్ట్ అయిన దగ్గర నుంచి భువనేశ్వరి, బ్రాహ్మణి రాజమండ్రిలోనే ఉంటున్నారు. జగ్గంపేట దీక్షా శిబిరంలో ప్రజలనుద్దేశించి మాట్లాడిన భువనేశ్వరి, చంద్రబాబు ప్రజల కోసమే ఎప్పుడూ ఆలోచన చేస్తారని చెప్పుకొచ్చారు. ఏం తప్పు చేసారో చెప్పాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు ప్రజల మనిషి అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. చంద్రబాబు ఏం తప్పు చేశారని జైల్లో పెట్టారో చెప్పాలని డిమాండ్ చేసారు. తమ కుటుంబానికి ప్రజల డబ్బు అవసరం లేదన్నారు. హెరిటేజ్‌లో 2 శాతం అమ్మినా రూ.400 కోట్లు వస్తాయని చెప్పుకొచ్చారు. ప్రజల సొమ్ము మాకొద్దంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. మానవుడే దేవుడు అని నాన్న ఎన్టీఆర్ నమ్మారని వివరించారు. ఆ నీడలో తాము పెరిగామని ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రజల కోసమే తమ పోరాటమని స్పష్టం చేసారు. తమ కుటుంబం ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వేలాది మందిని చదివిస్తున్నామని వివరించారు. చంద్రబాబును ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచన చేస్తారని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ ఏపీని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తారని చెప్పారు. అటువంటి ప్రజల మనిషిని జైల్లో పెట్టారని, ప్రజల కోసం చంద్రబాబు జైలుకు వెళ్లారని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లబ్ది చెంది అనేక మంది సీఈవో స్థాయికి వెళ్ళారని చెప్పారు. చంద్రబాబు చేసింది తప్పా అనేది ఆలోచించాలని సూచించారు. ఐటీ, ఇతర రంగాల మద్దతుదారులు హైదారాబాద్ నుంచి రాజమండ్రికి వచ్చారన్నారు. కానీ పోలీసులు అడ్డుకుని, వారిని ఆపేశారన్నారు. హైదరాబాద్ నుంచి రావడానికి పాస్ పోర్ట్‌లు కావాలా అని ప్రశ్నించారు.
ప్రజా ధనం మాకొద్దు !
September 25, 2023
0
Tags