మోమోస్ వెజిటేబుల్స్, నాన్ వెజ్ లలో కూడా లభ్యం అవుతూ ఉంటాయి. వీటిని ఒక్కసారి టేస్ట్ చేశారంటే చాలు.. ఒక దాని తర్వాత మరొకటి.. అలా నోట్లోకి వెళ్తూనే ఉంటాయి. స్మూత్ కూడా ఉంటాయి. అయితే వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. వీటిని ఎంత ఆవిరిలో ఉడికించి చేసినా కూరగాయలు, మాంసాలు ఉన్నా ఇవి అంత ఆరోగ్యకరం కాదని అంటున్నారు. మోమోస్ ను మైదాతో చేస్తారు కాబట్టి వీటి అరుగుదల శక్తి తక్కువగా ఉంటుంది. మోమోస్ చేయడానికి ముఖ్యంగా మైదా పిండినే ఉపయోగిస్తారు. ఈ పిండి శుద్ధి చేసినదే ఉపయోగించాలి. అలాగే పరిశుభ్రమైన పిండినే వాడాలి. కానీ రోడ్ సైడ్ వ్యాపారులు ఎలాంటి పిండిని ఉపయోగిస్తారో మనకు తెలియదు. టేస్ట్ బాగుంటున్నాయి కదా అని మోమోస్ అతిగా తినకూడదు. వారానికి ఒక సారి తింటే పర్వాలేదని నిపుణులు అంటున్నారు. అలాగే మీరు తినే వాటిలో ఉండే పదార్థాలపై కూడా ఫోకస్ పెట్టాలి. చాలా వరకు మోమోస్ ను రోడ్ సైడ్ స్టాల్స్ లో అమ్ముతారు. చాలా తక్కువ ధరకే విక్రయిస్తూంటారు. దీంతో ఈ మోమోస్ తయారీలో ఉపయోగించే పదార్థాల నాణ్యతపై కూడా జాగ్రత్తగా ఉండాలి. శుభ్రంగా తయారు చేసిన చోట మాత్రమే వీటిని తినాలి. మోమోస్ ను సరైన పద్దతిలో ఆవిరిలో ఉడికించాలి. అంతే కాని వేయించినవి మాత్రం అస్సలు తినకూడదు. అలాగే వీటిలో ఉండే ఫిల్లింగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటిల్లో మాంసాన్ని, కూరగాయలను ఫిల్లింగ్ చేస్తారు. వీటిని సరైన విధంగా ఉడికించాలి. లేదంటే జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. సరిగ్గా ఉడికించని నాన్ వెజ్ కారణంగా ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, వాంతులు వంటివి తలెత్తుతాయి. వాటిల్లో వాడే సాస్ లు, ఇచ్చే చట్నీ కారణంగా గుండె జబ్బులు, రక్త పోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు నిపుణులు.
మోమోస్ - అనర్ధాలు !
September 09, 2023
0
Tags