తల్లి బీమా సొమ్ములో వాటా కోసం జరిగిన గొడవలో ఒకరి మృతి

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లా పశ్చిమ్‌ తోలా ప్రాంతానికి చెందిన రామ్‌రాణి ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ కు సంబంధించిన రూ.2 లక్షలు పెద్ద కుమారుడు రాజబహదూర్ బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. తల్లి చనిపోవడంతో అందిన బీమా సొమ్ములో వాటా కోసం ముగ్గురు అన్నదమ్ముల మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఇది మరింత ముదరడంతో గురువారం రాత్రి ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కర్రలతో కొట్టుకున్నారు. చిన్న తమ్ముడు 45 ఏండ్ల రామ్ ఆస్రే ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతిపై అతడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు అన్నలపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)