అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి : సీబీఐ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సిబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటికే అవినాష్ కు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పై డాక్టర్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అభ్యంతరాలను కోర్టు ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ ని కోర్టు ఆదేశించింది. వాదనలు విన్న న్యాయస్థానం సెప్టెంబర్ 11న ఈ కేసు విచారించాలని నిర్ణయించింది. వాస్తవానికి జూలై నుంచి వివేకా హత్య కేసు విచారణలో ఎటువంటి పురోగతి లేదు. సిబిఐ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. జూన్ 30 లోపు దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ గడువు పూర్తయినా ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి. కానీ దర్యాప్తునకు సమయం కావాలని సీబీఐ కోరలేదు. దీంతో విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ వరకు వాయిదా వేసింది. ఇంతలో సునీత వేసిన పిటీషన్ న్యాయస్థానం ముందుకు వచ్చింది. దీంతో కోర్టు ఆదేశాలతో సిబిఐ తప్పనిసరి పరిస్థితుల్లో అఫిడవిట్ దాఖలు చేయాల్సి వచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)