ఆలయంలో నిబంధనలు ఉల్లంఘనతో రాజవంశ మహిళ అరెస్టు

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలోని ఓ దేవాలయానికి పూర్వపు రాజకుటుంబానికి జితేశ్వరి దేవి ఆలయానికి వచ్చారు. అయితే ఆమె స్వయంగా హారతి ఇవ్వాలని గర్భగుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆలయ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడ తోపులాట జరిగి ఆమె కిందపడిపోయారు. ఆమె మద్యం సేవించి ఉందని గమనించిన ఆలయ అధికారులు, పోలీసులు ఆమెను ఆలయ ప్రాంగణం బయటకు వెళ్లిపోవాలని కోరారు. దీంతో ఆమె వారితో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆలయంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. పోలీసులు తీసుకువెళ్తుండగా ఆలయంలో అవినీతి జరిగిందని ఆమె ఆరోపణలు చేశారు. ఆమెపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా ఆమె బెయిల్ ను తిరస్కరించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆమెను జైలుకు పంపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)