బ్యాంకు అధికారులపై కేసులు నమోదు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా సదుంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నెలకొల్పేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తిరుపతి శాఖ నుంచి తిరుపతికి చెందిన నితిన్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ రూ.24 కోట్ల రుణం తీసుకుంది. రుణాల పంపిణీలో జాప్యం కావడం, ఆ తర్వాత రుణ చెల్లింపుల విషయంలో కంపెనీ, బ్యాంకు అధికారుల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. కంపెనీ ఖాతాలను నిరర్ధక ఆస్తులుగా బ్యాంకు ప్రకటించడంతో కంపెనీ ఛైర్మన్‌ ఓవీ రమణ కోర్టును ఆశ్రయించారు. బ్యాంకు అధికారులు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌కు ఆహ్వానించి రూ.1.59 కోట్లు రాబట్టారు. అనంతరం బ్యాంకు నిబంధనలు అంగీకరించలేదంటూ కంపెనీ, ఛైర్మన్‌కు సంబంధించిన ఆస్తులను బ్యాంకు జప్తు చేసింది. దీనిపై నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)ను, తిరుపతి కోర్టును కంపెనీ ఛైర్మన్‌ ఆశ్రయించారు. బ్యాంకు అధికారులు ఓటీఎస్‌కు సంబంధించి మోసం, దుర్వినియోగం చేశారని ఆరోపించారు. దీనిపై తిరుపతి నాలుగో అదనపు జిల్లా జడ్జి సంబంధిత బ్యాంకు అధికారులపై కేసులు నమోదు చేయాలని అలిపిరి పోలీసులను ఆదేశించారు. ఆ మేరకు ఈ నెల 3న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పని చేసే ముగ్గురు జనరల్‌ మేనేజర్లు, నలుగురు చీఫ్‌ మేనేజర్లపై కేసులు నమోదు చేశామని సీఐ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)