బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది జడ్జిలపై వ్యాఖ్యలు చేశారంటూ తెదేపా నేతలు బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందిని ప్రతివాదులుగా పేర్కొంటూ ఏజీ శ్రీరామ్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. కొంత మంది జడ్జిలను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో ట్రోల్‌ చేస్తున్నారని ఏజీ శ్రీరామ్‌ వాదించారు. దూషణలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయన్నారు. దీనిపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని డీజీపీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అనంతరం కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)