2-0 తేడాతో సిరీస్‌ కైవశం

Telugu Lo Computer
0


ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచింది. తొలుత బ్యాటింగ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ (105), శ్రేయస్‌ అయ్యర్‌ (104) సెంచరీలతో చెలరేగగా, సూర్యకుమార్‌ యాదవ్‌( 72 నాటౌట్‌), కేఎల్‌ రాహుల్‌(52) ఆఖరిలో అదరగొట్టారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌ 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఆ్రస్టేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులుగా (డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం) నిర్దేశించారు. ఆసీస్‌ 28.2 ఓవర్లలో 217 పరగులకు ఆలౌటైంది. భారత భారత బౌలర్లలో అశ్విన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. జడేజా, ప్రసిద్ద్‌ కృష్ణ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇ​క ఈ సిరీస్‌ విజయంపై మ్యాచ్‌ అనంతరం భారత కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ స్పందించాడు. వరల్డ్‌కప్‌కు ముందు ఇటువంటి అద్భుత విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని రాహుల్‌ తెలిపాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)