స్పైనల్ మస్కులర్ అట్రోఫీ వెన్నెముక కండరాల క్షీణత, జన్యుపరమైన వ్యాధి. ఇది తల్లిదండ్రుల నుండి బిడ్డకు వెళుతుంది. ఈ వ్యాధికి జొల్జెన్స్మా ఇంజక్షన్ మాత్రమే చికిత్స. ఈ ఇంజక్షన్ ఖరీదు రూ.18 కోట్లు. ఈ వ్యాధితో బాధపడుతున్న చాలా మంది పిల్లలు చనిపోవడానికి ఇదే కారణం. వ్యాధి పుట్టిన వెంటనే వెన్నెముక కండరాల క్షీణత సంభవిస్తుంది. దీనికి ఏ మందు కూడా పని చేయదు. ఈ వ్యాధి కారణంగా పిల్లల శరీర కండరాలు బలహీనంగా మారడం ప్రారంభిస్తాయి. కాళ్లు, చేతులు పనిచేయడం మానేస్తాయి. ఈ వ్యాధి పిల్లల నాడీ కణాలను అలాగే వెన్నుపామును దెబ్బతీయడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా నడవడం, ఎవరితోనైనా మాట్లాడటం కూడా కష్టం అవుతుంది. తీవ్రమైన సందర్భాల్లో.. ఈ వ్యాధి శ్వాస సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది మరణానికి దారితీస్తుంది. డాక్టర్స్ చెప్పిన వివరాల ప్రకారం.. జన్యువులు కనిపించకపోవడం వల్లే ఈ వ్యాధి వస్తుందని చెప్పారు. తల్లిదండ్రుల నుండి బిడ్డకు వెళుతుంది. దీని ఏకైక చికిత్స జోల్జెన్స్మా ఇంజెక్షన్. ఇది ఒక అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీచే తయారు చేయబడింది. వెన్నెముక కండరాల క్షీణత చాలా ప్రమాదకరమైనది. ఇది పిల్లలను పూర్తిగా వికలాంగులను చేస్తుంది. దీని లక్షణాలు కూడా ప్రారంభంలోనే కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ వ్యాధి కేసులు చాలా అరుదుగా ఉన్నప్పటికీ, ఎవరికైనా ఈ వ్యాధి వచ్చినట్లయితే, వారిని కాపాడుకోవడం చాలా కష్టం. చాలా సందర్భాలలో వెన్నెముక కండరాల క్షీణత లక్షణాలు బిడ్డ పుట్టిన కొద్దిసేపటికే కనిపించడం ప్రారంభిస్తాయి.
జోల్జెన్ స్మా ఇంజెక్షన్ ఖరీదు రూ. 18 కోట్లు !
September 14, 2023
0
Tags