కన్నడ హీరో, దర్శకుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందనతో కలిసి విదేశాలకు విహార యాత్రకు వెళ్లాడు. అక్కడ స్పందనకు గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లుగా నిర్థారించారు. ఈ వార్త మొత్తం కన్నడ చిత్ర పరిశ్రమకు షాకింగ్ కు గురిచేసింది. ఆమె భౌతికకాయం రేపు ఆగస్టు 08న బెంగళూరుకు చేరుకుంటుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. స్పందనకు ముందుగా బీపీ తగ్గి గుండెపోటుకు దారి తీసిందని తెలుస్తోంది. అక్కడే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విజయ రాఘవేంద్ర-, స్పందన ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2007ఆగస్టు 26 న వివాహం చేసుకున్నారు. వీరికి శౌర్య అనే కొడుకు ఉన్నాడు. వీరి 16వ వివాహ వార్షికోత్సవానికి మరో19 రోజుల ముందు ఈ విషాదం చోటుచేసుకుంది. రిటైర్డ్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ బీకే శివరామ్ కుమార్తె స్పందన. విజయ్ రాఘవేంద్ర కన్నడ సినిమాల్లో నటుడిగా దర్శకుడిగా కొనసాగుతున్నారు.
విదేశాల్లో కన్నడ హీరో భార్య గుండెపోటుతో మృతి
August 07, 2023
0
Tags